బాలకృష్ణ ఛాన్స్ పట్టేశాడా..?

May 25, 2020


img

బాలయ్య బాబు ఛాన్స్ ఇస్తే తాను సినిమా చేస్తా అని సరిలేరు ప్రమోషన్స్ లో చెప్పిన అనీల్ రావిపూడి మాట బాలకృష్ణకు వినిపించింది అనుకుంటా అందుకే అనీల్ తో సినిమాకు ఫిక్స్ అయ్యాడు బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సినిమా తర్వాత 107వ సినిమా అనీల్ రావిపూడితోనే ఉంటుందని తెలుస్తుంది. పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపూడి బాలకృష్ణ కోసం ఒక అద్భుతమైన కథ సిద్ధం చేశాడట. 

అసలైతే బాలయ్య బాబు 100వ సినిమాగా అది రావాల్సి ఉంది. రామారావు టైటిల్ తో అనీల్ రావిపూడి రాసుకున్న ఈ సినిమాలో సర్ ప్రయిజ్ రోల్ లో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని తెలుస్తుంది. మరి బాలకృష్ణ, అనీల్ రావిపూడి కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. బోయపాటి శ్రీను సినిమా పూర్తి కాగానే ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష