ఆది సాయికుమార్ 'బ్లాక్'

May 23, 2020


img

సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా ప్రేమకావాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అతనికి సరైన సక్సెస్ రాలేదని చెప్పాలి. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఆది. ఇక లేటెస్ట్ గా అతను పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన కృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాము బ్లాక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మహంకాళి క్రియేషన్స్ బ్యానర్ లో మహంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఈ మూవీలో దర్శనా బానికే ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన కృష్ణ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సినిమా ఓకే చేశాడట ఆది సాయికుమార్. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాతో హిట్ కొట్టడం పక్కా అని అంటున్నారు చిత్రయూనిట్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ముహూర్తం పెట్టుకున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకోగా లాక్ డౌన్ తర్వాత సినిమా మళ్ళీ షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో అయినా ఆది సాయికుమార్ హిట్టు కొడతాడో లేదో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష