చిరు, ప్రభాస్ సంక్రాంతికి రానట్టే..!

May 23, 2020


img

2021 సంక్రాంతికి ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అయితే లాక్ డౌన్ వల్ల అనుకున్న టైం కు రిలీజ్ చేయడం కష్టమని తెలుస్తుంది. అందుకే మరోసారి ఈ సినిమా వాయిదా వేస్తారని చెప్పకనే చెప్పారు. ఇక సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ రావడం లేదని తెలియగానే చిరు ఆచార్య, ప్రభాస్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమాలు రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం చిరు ఆచార్య, ప్రభాస్ 20వ సినిమా కూడా సంక్రాంతికి కష్టమే అంటున్నారు. 

ఆచార్య సినిమా మరో 40 రోజులు షూట్ చేయాల్సి ఉంది. సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తాడని తెలుస్తుంది. చెర్రీ సీన్స్ కూడా షూటింగ్ చేయాల్సి ఉంది. ఇక ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఎలా లేదన్నా రెండు నెలలు చేయాల్సి ఉంటుంది. అందుకే 2021 సంక్రాంతికి ఆచార్య కష్టమే అంటున్నారు. ఇక ప్రభాస్, రాధాకృష్ణ కాంబోలో వస్తున్న సినిమా ఇంకా షూటింగ్ చేయాల్సింది ఉందట. ఆ సినిమా కూడా 2021 సంక్రాంతికి బదులుగా సమ్మర్ టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అటు ట్రిపుల్ ఆర్, ఆచార్య, ప్రభాస్ 20 సినిమా సంక్రాంతికి రావడం కష్టమని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష