ఏంటి బావ నీకు పెళ్ళంట

May 23, 2020


img

మెగా బ్రదర్ నాగబాబు వరుణ్ తేజ్, నిహారిక పెళ్లి వార్తలపై చేసిన కామెంట్స్ లింక్ షేర్ చేస్తూ మెగా మేనళ్లుడు సాయి తేజ్ వరుణ్ తేజ్ కు ట్వీట్ చేశాడు. నిహారికకు అబ్బాయిని సెలెక్ట్ చేశామని.. త్వరలో ఎనౌన్స్ చేస్తామని అన్నారు. ఇక వరుణ్ తేజ్ కు కూడా త్వరలోనే పెళ్లి చేస్తామని అన్నారు. అయితే ఆ వీడియో క్లిప్ ను షేర్ చేస్తూ ఏంటి బావా నీకు పెళ్ళంట అంటూ కామెంట్ పెట్టాడు. మెగా హీరోల మధ్య ఈ సాన్నిహిత్యం ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంది. 

సాయి తేజ్, వరుణ్ తేజ్ ఇద్దరు తమ సత్తా చాటుతున్నారు. వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ తో హిట్ కొత్తగా.. చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో సాయి తేజ్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు ఇద్దరు కూడా మల్టీస్టారర్ చేసేందుకు రెడీ అని చెప్పారు. సరైన కథ దొరకడమే ఆలస్యం మేము కలిసి చేస్తాం అంటున్నారు వరుణ్ తేజ్, సాయి తేజ్. మా ఈ ఇద్దరిని కలిపే కథ ఏ డైరక్టర్ రాస్తాడు.. ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష