నాని సినిమా అటకెక్కిందా

May 23, 2020


img

నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రస్తుతం 'V' సినిమా రిలీజ్ కు రెడీగా ఉండగా.. శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీశ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ సాంకృత్యన్ డైరక్షన్ లో సినిమా శ్యామ్ సింగ్ రాయ్ సినిమా ఎనౌన్స్ చేశాడు. నాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. 

ఈ సినిమా బదులుగా నాని మరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. టక్ జగదీశ్ పూర్తికాగానే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. నాని పాన్ ఇండియా మూవీని హడావిడి చేసిన శ్యామ్ సింగ్ రాయ్ సినిమా మొదలు కాకుండానే ఆగిపోయిందని అంటున్నారు. కరోనా వల్ల లాక్ డౌన్ చేయడం.. దాని వల్ల షూటింగ్స్ ఆగిపోవడం.. థియేటర్స్ మూసేయడం.. ఇలాంటి టైంలో భారీ బడ్జెట్ అంటే కష్టమని నాని భావించి ఈ సినిమాను వాయిదా వేసుకున్నాడట. మరి తర్వాత అయినా ఈ సినిమా ఉంటుందా లేక అటకెక్కుతుందా అన్నది తెలియాల్సి ఉంది.   Related Post

సినిమా స‌మీక్ష