చంద్రముఖి 2 జ్యోతికకు నో ఛాన్స్

May 23, 2020


img

 సూపర్ స్టార్ రజినీకాంత్  పి.వాసు డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా చంద్రముఖి. 2005 లో సంచలన విజయం అందుకున్న ఈ సినిమా సీక్వల్ ఈమధ్యనే మొదలు పెట్టారు. లారెన్స్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సీక్వల్ మూవీని కూడా వాసు డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో జ్యోతిక ప్లేస్ లో నిన్నటితరం స్టార్ హీరోయిన్ సిమ్రాన్ నటిస్తుందని తెలుస్తుంది. 

చంద్రముఖికి వెనుక జరిగిన కథ ఏంటంటే.. రజినికాంత్ నటించిన సినిమాలో కూడా ముందు గంగ పాత్రలో సిమ్రాన్ ను అనుకున్నారట. డేట్స్ అడ్జెస్ట్ కాక ఆమె బదులుగా జ్యోతికను తీసుకున్నారు. అయితే జ్యోతికని తీసుకుని కాంప్రమైజ్ అయినా కూడా సినిమాకు ఆమె చాలా ప్లస్ అయ్యింది. ఆ సినిమాతో జ్యోతిక కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక అప్పుడు చంద్రముఖి ఛాన్స్ మిస్సైన సిమ్రాన్ ఇప్పుడు చంద్రముఖి 2లో నటిస్తుందని అంటున్నారు. మరి వారాయ్ అంటూ చంద్రముఖి పాత్రలో సిమ్రాన్ ఎలా భయపెడుతుందో చూడాలి. 
Related Post

సినిమా స‌మీక్ష