సినిమా షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్..!

May 22, 2020


img

గత రెండు రోజులుగా టాలీవుడ్ సినీ ప్రముఖులు తెలంగాణా ప్రభుత్వంతో షూటింగ్ విషయాల గురించి చర్చలు జరిపారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో గురువారం చిరంజీవి ఇంట్లో మీటింగ్ జరుగగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలన్న విషయం మీద చర్చలు జరిపారు. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ కు భారీ నష్టం కలిగిందని.. షూటింగ్స్ కు అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరారు సినీ పెద్దలు. అయితే దీనిపై సానుకూలంగా స్పందించారు కేసీఆర్. జూన్ మొదటివారం నుండి షూటింగ్స్ ప్రారంభించుకోమని అన్నారు. 

షూటింగ్స్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేయొచ్చని అన్నారు. అయితే దీనిపై ప్రభుత్వం త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు ఇస్తుందని, వాటిని అనుసరిస్తూ షూటింగ్స్ చేసుకోవాలని అన్నారు. అందుకు సినీ పెద్దలు కూడా అంగీకరించడం జరిగింది. చిరంజీవి, నాగార్జున, త్రివిక్రమ్, సురేష్ బాబు, దిల్ రాజు, కొరటాల శివ తదితరులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. 

షూటింగ్స్ ప్రారంభం అయినా కూడా థియేటర్లు తెరచుకునేందుకు మరికొద్దిరోజులు టైం పడుతుందని తెలుస్తుంది. సినిమా హాళ్లను ఆగష్టులో తెరవాలని తెలంగాణా థియేటర్ అసోషియేషన్, డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారు. అంతేకాదు థియేటర్స్ తెరచినా కేవలం 3 ఆటలకే పర్మిషన్ ఇస్తారట. సగం టికెట్స్ మాత్రమే అమ్మి.. సోషల్ డిస్టెన్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. Related Post

సినిమా స‌మీక్ష