ప్రభాస్ సినిమా నుండి అతను ఎగ్జిట్..!

May 22, 2020


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాకు ఓ డియర్, జాన్, రాధే శ్యామ్ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ నుండి అతను ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. 

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాకు మ్యూజిక్ అందించాడు అమిత్ త్రివేది. అంతేకాదు నాని వి సినిమాకు అమిత్ మ్యూజిక్ అలరించనుంది. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అక్కడ సూపర్ ఫామ్ లో ఉన్న అమిత్ త్రివేదిని మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకోడానికి ప్రధాన కారణం కూడా అదే. కారణాలు బయటకు రాలేదు కానీ ప్రభాస్ సినిమా నుండి అమిత్ తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష