కెజిఎఫ్ డైరెక్టర్ పై మండిపడుతున్న కన్నడ ప్రేక్షకులు..!

May 22, 2020


img

కెజిఎఫ్ తో కన్నడ సినిమా స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు డైరక్టర్ ప్రశాంత్ నీల్. అక్కడ స్టార్ హీరో యష్ కూడా సౌత్ అంతటా సూపర్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం కెజిఎఫ్ చాప్టర్ 2 సెట్స్ మీద ఉంది. ఈ ఇయర్ ఎండింగ్ లో కెజిఎఫ్ 2 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ చేస్తాడని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ట్వీట్ చేయడంతో ఆ విషయం కన్ఫర్మ్ అయ్యింది. 

కెజిఎఫ్ తర్వాత డైరక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగు హీరోతో సినిమా చేయడంపై మండిపడుతున్నారు కన్నడ ప్రేక్షకులు. ఇక్కడ సినిమా తీసి హిట్ అందుకుని అక్కడ స్టార్ తో సినిమా తీయడం ఏంటని అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఎనౌన్స్ మెంట్ రాకముందే కన్నడ ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. ఒకవేళ ఆ కాంబినేషన్ సినిమా సెట్ అయితే ప్రశాంత్ నీల్ పై కన్నడిగులు సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది. అయినా మన దర్శకుడికి పిలిచి ఛాన్స్ ఇచ్చినందుకు సంతోషపడాలి కానీ అతను మన దగ్గర మాత్రమే సినిమాలు చేయాలని అనుకోవడం విచిత్రంగా ఉంది.  Related Post

సినిమా స‌మీక్ష