నాగ శౌర్య సినిమాకు అదిరిపోయే రేటింగ్..!

May 22, 2020


img

యువ హీరో నాగశౌర్య లేటెస్ట్ మూవీ అశ్వద్ధామ రికార్డ్ రేటింగ్ తెచ్చుకుంది. నాగశౌర్య కెరియర్ లో హయ్యెస్ట్ టిఆర్పి రేటింగ్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అశ్వద్ధామ. రమణ తేజ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు కథ, కథనం హీరో నాగశౌర్య అందించడం విశేషం. సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. ఈ ఇయర్ జనవరి లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి చేయలేదు. జస్ట్ ఓకే అనిపించుకున్న నాగశౌర్య అశ్వద్ధామ టివి రేటింగ్స్ లో మాత్రం దుమ్ముదులిపేసింది.        

ఈ సినిమా జెమినీ టివిలో మే 15న టెలికాస్ట్ చేశారు. తెలుగు అర్బన్ మార్కెట్ లో 9. 10 రేటింగ్స్ తో అశ్వద్ధామ అదరగొట్టింది. సినిమాకు వచ్చిన రేటింగ్ చూసి చిత్రయూనిట్ సంతోషంగా ఉన్నారు. లాక్ డౌన్ టైంలో సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటని సినిమాలు కూడా బుల్లితెర మీద హిట్ కొట్టాయి. ఈమధ్యనే కార్తికేయ 90 ఎం.ఎల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ సాధించింది. ఇప్పుడు ఆ లిస్ట్ లో అశ్వద్ధామ కూడా చేరింది.  Related Post

సినిమా స‌మీక్ష