రియల్ హీరో మంచు మనోజ్

May 21, 2020


img

పుట్టినరోజు నాడు గొప్ప పని చేసి తన మంచి మనసు చాటుకున్నాడు మంచు మనోజ్. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కోసం స్వయంగా రెండు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేశారు మనోజ్. హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్లేందుకు రెండు బస్సులు ఏర్పాటు చేసినట్టు వెళ్లడించారు మంచు మనోజ్. బస్సుల్లో వారిని తరలించేందుకు కేంద్రం నుండి పర్మిషన్ తీసుకున్నట్టు చెప్పారు మనోజ్. బస్సులో ప్రయాణిస్తున్న వారికి మాస్కులు, శానిటైజర్లతో పాటుగా ఆహారాన్ని కూడా అందించారు. ఇక్కడితో ఆపకుండా ఈ సేవలను కొనసాగించాలని భావిస్తున్నారట మంచు మనోజ్.

మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటూ ఒకరోజు సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు షాక్ ఇచ్చిన మనోజ్ ఆ తర్వాత తన భార్య ప్రణతి రెడ్డితో విడాకులు తీసుకున్నారు. ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మళ్ళీ ఈమధ్యనే తన సొంత బ్యానర్ లో అహం బ్రహ్మాస్మి సినిమాతో రాబోతున్నాడు మంచు మనోజ్. Related Post

సినిమా స‌మీక్ష