రానా విత్ మిహీక.. ఇట్స్ అఫీషియల్

May 21, 2020


img

మొన్నటిదాకా బ్యాచిలర్ గా అనుకున్న దగ్గుబాటి వారసుడు రానా తన తోడుని వెతుక్కున్నాడు. ఎన్నాళ్ళ నుండి వ్యవహారం జరుగుతుందో ఏమో కానీ రానా, మిహీక పెళ్లంటూ అలా న్యూస్ వచ్చిందో లేదో ఈరోజు వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే రానా, మిహీకల ఎంగేజ్మెంట్ జరిగిందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని వెళ్లడిస్తూ రానా ఇట్స్ అఫీషియల్ అంటూ ట్వీట్ చేసి విహీకా బజాజ్ తో ఉన్న పిక్స్ షేర్ చేశాడు. 

మొత్తానికి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రానా కూడా ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. అసలు ఎలాంటి లీక్స్ లేకుండా రానా తన లవ్ మ్యారేజ్ విషయాన్ని వెళ్లడించచడం విశేషం. రానా, విహీక బజాజ్ ల మ్యారేజ్ ఈ ఇయర్ ఎండింగ్ జరుగనుందని తెలుస్తుంది. ప్రస్తుతం రానా విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. వేణు ఊడుగుల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. 

Related Post

సినిమా స‌మీక్ష