సినీ ప్రముఖులతో తలసాని భేటీ..!

May 21, 2020


img

లాక్ డౌన్ సడలింపులతో కొద్దిగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.. కరోనాతో కలిసి జీవించాలన్న కెసిఆర్ మాట మేరకు జనాలు మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తో తమ పనులు చేసుకుంటున్నారు. అయితే అన్నిటికి ఓకే చెప్పిన ప్రభుత్వం సినిమా షూటింగ్స్ కు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. అంతేకాదు మాల్స్, థియేటర్స్ లాంటి వాటికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. షూటింగులను ఎప్పటి నుండి మొదలుపెట్టాలి.. సినిమాలకు సంబందించి ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించనుంది అన్న విషయాల మీద చిరంజీవి ఇంట్లో తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశం ఏర్పాటు చేశారు. 

చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, సి.కళ్యాణ్, దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, డైరక్టర్స్ రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, ఎం.శంకర్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మామూలు షూటింగ్స్ కు ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ పర్మిషన్ తప్పనిసరి అన్నారు చిరంజీవి. అన్ని సన్నివేశాలకు యూనిట్ మొత్తం అవసరం లేదు.. తక్కువమందితో కూడా సీన్లు తీసేయొచ్చు.. ప్రభుత్వ అనుమతిస్తే ముందు ఒక టెస్ట్ షూట్ చేస్తాం అన్ని గైడ్ లైన్స్ పాటిస్తూ చేస్తామని దర్శకుడు రాజమౌళి సలహా ఇచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎలాంటి అభ్యంతరం లేదు.. ఈ నెల ఆఖరి వరకు లాక్ డౌన్ ఉంది కాబట్టి షూటింగ్ విషయంపై అనుమతులు పరిశీలిస్తున్నామని.. సీఎం కేసీఆర్ తో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు తలసాని.   Related Post

సినిమా స‌మీక్ష