నాకు మంచి పేరు వెతికిపెట్టండి..!

May 21, 2020


img

కన్నడ భామ రష్మిక మందన్న పేరు మార్చుకోవాలని అనుకుంటుంది.. దానికి తన అభిమానులనే ఓ మంచి పేరు వెతికి పెట్టండి అని అడిగింది. రష్మిక ఏంటి పేరు మార్చుకోవడం ఏంటి.. అసలేంటి ఇదంతా అనుకుంటున్నారు కదా.. లాక్ డౌన్ మొదలైన నాటి నుండి తన సీక్రెట్స్ చెబుతూ ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో చాట్ కూడా చేస్తుంది. వాళ్ళు అడిగే చిలిపి ప్రశ్నలకు అంతే చిలిపి సమాధానాలు చెబుతున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా ఆడియెన్స్ కే ఒక వెరైటీ ప్రశ్న వేసింది. ఒకవేళ నేను పేరు మార్చుకోవాల్సి వస్తే మీరు నాకు ఏ పేరు పెడతారంటూ ఆడియెన్స్ ను కోరింది. 

రష్మిక అలా అడగడమే ఆలస్యం వాళ్లకు నచ్చిన పేర్లన్నీ ఆమె ముందు ఉంచారు. కొందరైతే డియర్ కామ్రేడ్ లో ఆమె పాత్ర పేరు లిల్లీ పేరుని సజెస్ట్ చేశారు. కొందరు తలా రష్మిక, మోని, రష్మిక విజయ్ దేవరకొండ ఇలా తమకు తోచిన పేర్లన్నీ చెప్పేశారు. అయితే అసలైన రష్మిక ఫ్యాన్స్ మాత్రం మీకు రష్మిక అన్నదే పర్ఫెక్ట్.. పేరు మార్చాల్సిన పని లేదు అంటూ చెప్పుకొచ్చారు. అంటూ రష్మిక ఆడియెన్స్ తో చేస్తున్న ఈ స్పెషల్ ప్రోగ్రామ్ వాళ్ళను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష