దృశ్యం 2 వస్తుంది..!

May 21, 2020


img

2013లో జీతూ జోసెఫ్ డైరక్షన్ లో మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా దృశ్యం. అక్కడ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు. రెండు చోట్ల కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక తమిళంలో కమల్ హాసన్ హీరోగా మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ పాపనాశం టైటిల్ తో రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి ఫలితాన్ని రాబట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ రెడీ అవుతుంది. 

ఈరోజు మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా దృశ్యం 2 అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేశారు. ఈ సీక్వల్ ను కూడా జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తుండగా ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ లో ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. దృశ్యం టైం లో మోహన్ లాల్ కు తెలుగులో అంతగా మార్కెట్ లేదు. జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో తెలుగులో కూడా మోహన్ లాల్ కు మంచి గుర్తింపు వచ్చింది. అందుకే దృశ్యం 2 డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పుట్టినరోజు ఓ క్రేజీ మూవీ సీక్వల్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రయిజ్ ఇచ్చాడు మోహన్ లాల్. 

Related Post

సినిమా స‌మీక్ష