స్టైలిష్ స్టార్ తో మారుతి..?

May 21, 2020


img
ఈరోజుల్లో, బస్టాప్ సినిమాలతో దర్శకుడిగా సక్సెస్ అయినా ఆడియెన్స్ లో నెగటివ్ ఇమేజ్ తెచ్చుకున్న మారుతి ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ప్రతిరోజూ పండుగే అంటూ సాయి తేజ్ తో సూపర్ హిట్ అందుకున్న మారుతి ప్రస్తుతం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎన్నాళ్ళనుండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్న మారుతికి ఆ ఛాన్స్ మాత్రం రావట్లేదు. 

మారుతి, అల్లు అర్జున్ ఇద్దరు బయట మంచి స్నేహితులే కానీ ఫ్రెండ్ కదా అని రిస్క్ చేయదలచుకోలేదు బన్నీ అంతేకాదు తన సినిమాతో మారుతి మరో లెవల్ కు వెళ్లాలని అనుకుంటున్నాడు. అయితే లేటెస్ట్ గా అల్లు అర్జున్ ఇమేజ్ కు తగిన కథ రాశాడట మారుతి. బన్నీకి లైన్ వినిపిస్తే డెవెలప్ చేయమని చెప్పాడట. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్న బన్నీ తన నెక్స్ట్ సినిమా మారుతి డైరక్షన్ లో చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మారుతి, అల్లు అర్జున్ కలిసి తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే సినిమా ఇచ్చేలా ఉన్నారని చెప్పొచ్చు.  


Related Post

సినిమా స‌మీక్ష