ఆమె కోసం 15 కోట్లా.. దత్ గారికి డేర్ ఎక్కువే..!

May 20, 2020


img

సాహో తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అశ్వనీదత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్ తో ఇంటర్నేషనల్ లెవల్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అంటే నాగ్ అశ్విన్, ప్రభాస్ కలిసి తీసే సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందన్నమాట. బాహుబలితో వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్ మరోసారి అలంటి భారీ ప్రయత్నమే చేస్తున్నట్టు తెలుస్తుంది. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పదుకొనేని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమా కోసం ఆమె 15 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు ముంబై మీడియా టాక్. సినిమా రేంజ్ అలాంటిది కాబట్టి దర్శక నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇచ్చేనందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. సౌత్ సినిమా అనగానే బాలీవుడ్ భామలు రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తారు. మనదగ్గర ఒక హీరోయిన్ కు మహా అయితే 2 లేదా 2.5 కోట్లు అంతే అంతకంటే ఎక్కువ ఇచ్చింది లేదు. కానీ దీపికాకు మాత్రం అడిగినంత 15 కోట్లు ఇచ్చేనందుకు సిద్ధమయ్యారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. Related Post

సినిమా స‌మీక్ష