విజయ్.. పూరి.. సెంటిమెంట్ పండుద్దా..!

May 20, 2020


img

ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కినా పూరి జగన్నాథ్, వరుస రెండు ప్లాపులతో ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫైటర్ (ప్రచారంలో ఉన్న టైటిల్). పూరి టాకీస్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. హిందీలో ఈ మూవీని కరణ్ జోహార్ రిలీజ్ చేస్తుండటం విశేషం. 

ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే విజయ్ పూరి ఫైటర్ యాక్షన్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మాత్రమే కాదు పూరి మార్క్ సెంటిమెంట్ కూడా బాగా ఉంటుందని తెలుస్తుంది. పూరి సినిమాల్లో అన్ని సమపాళ్లలో ఉంటాయి. అందుకే ఫైటర్ లో కూడా సెంటిమెంట్ తో కూడా ఆడియెన్స్ ను మెప్పించాలని చూస్తున్నారు. అర్జున్ రెడ్డితో భారీ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ ఏర్పడింది. పూరి లాంటి డైరక్టర్ సినిమాతో బాలీవుడ్ అటెంప్ట్ చేస్తున్న విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష