బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్ షురూ..!

April 08, 2020


img

ఈ టైటిల్ చూసి కచ్చితంగా నందమూరి కాబినేషన్ సినిమానో.. దగ్గుబాటి బాబాయ్ అబ్బాయ్ కాంబోనో అనుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇది కొణిదెల వారి బాబాయ్ అబ్బాయ్ కాంబో గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్. పింక్ రీమేక్ గా వస్తున్నా వకీల్ సాబ్ తో మళ్ళీ తన ఫ్యాన్స్ ను అలరించేందుకు వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సినిమాను క్రిష్ డైరక్షన్ లో విరూపాక్ష చేస్తున్నాడని తెలుస్తుంది. 

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక స్పెషల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. బాబాయ్ సినిమాలో అబ్బాయ్ ఉంటే ఆ హంగామా వేరేలా ఉంటుంది. బాబాయ్ తో అబ్బాయ్ కలిసి సినిమా చేస్తే మెగా ఫ్యాన్స్ కు ఫుల్ హంగామా అని చెప్పొచ్చు. మరి ఈ కాంబో నిజంగా వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత క్రిష్ చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష