నీ కసి, కృషి రెండు నాకు ఇష్టం..!

April 08, 2020


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు బర్త్ డే సందర్భంగా విష్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవికి స్పెషల్ విషెస్ చేశారు. నీ డ్యాన్స్ లో గ్రేస్ చిన్నప్పటి నుండి ఉందని బన్నీ చిన్నప్పటి ఫోటో పెట్టి బన్నీకి స్పెషల్ బర్త్ డే శుభాకాంక్షలు అందించాడు చిరు. నీ కసి, కృషి రెండు నాకు చాలా ఇష్టమని అన్నారు. హ్యాపీ బర్త్ డే బన్నీ.. నువ్వు బాగుండాలబ్బా అంటూ ప్రస్తుతం రాబోతున్న సుకుమార్ సినిమా యాసలోనే డైలాగ్ వదిలాడు. 

చిరుని అభిమానించే మెగా హీరోల్లో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. చిరు అభిమానం చూపించే బన్నీ బర్త్ డే రోజు అతని మీద తన ప్రేమని చూపించాడు మెగాస్టార్ చిరంజీవి. చిరు చేసిన ట్వీట్ మెగా ఫ్యాన్స్ తో పాటుగా అల్లు ఆర్మీని ఖుషి అయ్యేలా చేస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. పుష్ప సినిమా కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ, మళయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొదటిసారి బన్నీ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఇదే అని చెప్పొచ్చు.  



 


Related Post

సినిమా స‌మీక్ష