అచ్చుగుద్దినట్టుగా సూర్యలానే ఉన్నాడే..!

April 07, 2020


img

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. అయితే అలాంటి మనుషులను అప్పుడప్పుడు చూస్తుంటాం.. ఒకేసారి డబుల్ యాక్షన్ అది కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం.. కొద్దిగా ముఖ కవళికలు కలిస్తేనే అతని మరొకతనిలా ఉన్నాడని అంటారు. అయితే లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరోని పోలిన ఒకతను తారసపడ్డాడు. అతనెవరో కాదు తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించిన జెనీలియా కజిన్ అని తెలుస్తుంది. 

రీసెంట్ గా జెనీలియా అతని పిక్ షేర్ చేసింది. అతన్ని చూస్తే అచ్చుగుద్దినట్టుగా సూర్యలానే ఉన్నాడు. హెయిర్ స్టైల్, మీసపు కట్టు అచ్చం అలానే ఉన్నాయి. సూర్యని ఇతన్ని పక్క పక్కన పెడితే కావలాలనే డౌట్ రాక మానదు. ఇంతకీ సూర్యలా ఉన్న ఇతని పేరు ధీరజ్ అని చెప్పింది జెనీలియా. కోలీవుడ్ లో స్టార్ హీరో గా సూర్యకు సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. వారికి ఈ డూప్ సూర్య గురించి తెలిస్తే అతన్ని ఫాలో అయిపోతారు కూడా. మొత్తానికి జెనీలియా లాక్ డౌన్ టైం లో భలే సర్ ప్రయిజ్ చేసింది. 



Related Post

సినిమా స‌మీక్ష