అల్లు అర్జున్ - సుకుమార్ 'పుష్ప'

April 07, 2020


img

అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ రేపు అనగా ఏప్రిల్ 8 బన్ని బర్త్ డే నాడు వస్తుందని చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా నుండి రేపు టైటిల్ పోస్టర్ వస్తుందని అంటున్నారు. ఇక ఫిల్మ్ నగర్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు పుష్క అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్. 

ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, బన్నిల కాంబినేషన్ లో  వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2021 సమ్మర్ టార్గెట్ తో రానుంది. సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో వస్తుందని తెలుస్తుంది. మరి టైటిల్ లీక్ అయినట్టుగా పుష్ప కన్ఫర్మ్ చేసుకోవాలంటే రేపు ఉదయం వరకు వెయిట్ చేయాల్సిందే. 



Related Post

సినిమా స‌మీక్ష