ఇండియన్ సూపర్ స్టార్స్ కలిసి చేసిన 'ఫ్యామిలీ' షార్ట్ ఫిల్మ్

April 07, 2020


img

కరోనాపై పోరాడేందుకు మనం అంతా ఇళ్లలోనే ఉండాలని అంటున్నారు సిని సెలబ్రిటీస్. అందుకే ప్రేక్షకులకు స్ఫూర్తి నింపేలా అన్ని భాషల స్టార్స్ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఇంట్లో అమితాబ్ సన్ గ్లాసెస్ కనిపించడం లేదని అంటాడు. అంతలో నేను వెతికి పెడతా అని దిల్జీత్ దొసాంజ్ అంటాడు. ఆ వెంటనే వెళ్లి రణ్ భీర్ సింగ్ ను అడుగుతాడు. రణ్ భీర్ వెళ్లి మమ్ముట్టి, మోహన్ లాల్ లను అడుగుతాడు వాళ్లు వారి భాషలో సమాధానం చెబుతారు. ఆ తర్వాత షేవింగ్ చేసుకుంటున్న చిరుని తలుపు కొట్టి మరి సన్ గ్లాస్ ల గురుంచి అడిగితే బాత్ రూమ్ లో షేవింగ్ చేసుకుంటూ ఇక్కడ సన్ గ్లాసెస్ లేవని అంటాడు. 

కన్నడ శివరాజ్ కుమార్ కూడా సన్ గ్లాసుల గురించి తనకు తెలియదని అంటాడు. అలియా భట్ దగ్గర ఉన్న సన్ గ్లాసులు ఇలా అందరు సమాధానం చెప్పిన తర్వాత ప్రియాంక చోప్రా వచ్చి అమితాబ్ కు సన్ గ్లాసులు ఇస్తుంది. ఫైనల్ గా వీటి అవసరం ఇప్పుడు లేదు బయటకు వెళ్లేప్పుడు కావాలి.. ఎక్కడో పెడితే పాడవుతాయి అన్నట్టుగా చెబుతాడు అమితాబ్. అందరు ఇంట్లోనే ఉండి సేఫ్ గా ఉండమని మెసేజ్ ఇచ్చారు అమితాబ్. అంతేకాదు ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఇండియన్ సినీ పరిశ్రమ ఒక్కటే అని మరోసారి ప్రూవ్ చేశారు. 




Related Post

సినిమా స‌మీక్ష