అల్లు అర్జున్ కొత్త బిజినెస్..!

April 06, 2020


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆడియో లేబల్ కంపెనీ ఒకటి మొదలు పెడుతున్నాడట అల్లు అర్జున్. స్టార్ హీరోల ఆడియో రైట్స్ భారీగా అమ్ముడవుతాయి. అంతేకాదు ఏదైనా సాంగ్ సూపర్ హిట్ అయితే అది యూట్యూబ్ లో సెన్సేషనల్ గా మారుతుంది. దాని ద్వారా కూడా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ ప్రత్యేకంగా తన సినిమాలోని పాటలన్ని బాగుండేలా చాలా జాగ్రత్త పడతాడు. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండటమే కాకుండా సాంగ్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతాడు. 

అందుకే తన సినిమా నుండే ఈ సరికొత్త బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆడియో లేబుల్ కంపెనీ బన్ని సొంతంగా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే మహేష్ చేస్తున్న మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగే ఆలోచనలో ఉన్న బన్ని కొత్తగా ఈ ఆడియో లేబుల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం బన్ని ముందు చూపుకు అందరు షాక్ అవుతున్నారు. కేవలం తన సినిమాలే కాదు అందరి సినిమాలు ఈ లేబుల్ వాడేలా మొదలు పెడుతున్నారట. మరి ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఈ ఆడియో లేబుల్స్ కు పోటీగా బన్ని స్టార్ట్ చేసే ఈ ఆడియో లేబుల్ బిజినెస్ ఎలా ఉండబోతుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష