కథలు రాస్తున్న హీరోయిన్..!

April 06, 2020


img

మళయాళ భామ నిత్యా మీనన్ తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కొన్నాళ్లుగా తెలుగులో పెద్దగా అవకాశాలు లేని నిత్యా మీనన్ గీతా గోవిందం లో చిన్న పాత్రలో కనిపించింది. అయితే సినిమా ఛాన్సులు వస్తున్నా మనసుకి నచ్చే కథలు రావట్లేదని అంటుంది నిత్యా మీనన్. ఇక లాక్ డౌన్ టైం లో అమ్మడు తనలోని కొత్త టాలెంట్ బయటకు తీస్తుంది. మాములుగా కథలు రాయడం ఇంట్రెస్ట్ చూపించే నిత్యా మీనన్ లాక్ డౌన్ టైంలో స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తుందట. 

తన చుట్టుపక్కల జరిగే విషయాలతో పాటుగా తన మనసులోని ఆలోచనలు కలిపి కథగా మారుస్తుందని తెలుస్తుంది. ఎప్పటికైనా మెగా ఫోన్ పట్టుకునే ఆలోచనలో ఉన్న నిత్యా మీనన్ హీరోయిన్ గా ప్రయత్నాలు మానేసి డైరక్టర్ గా మారుతుందేమో అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెప్పించిన నిత్యా మీనన్ మళ్ళీ సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష