వర్మ 'సిగరెట్' వెలిగించాడు..!

April 06, 2020


img

దేశం నుండి కరోనాని పారద్రోలేందుకు మన ప్రధాని మోడీ ఆదివారం 9 గంటల నుండి 9 నినిముషాల పాటు దీపాలు, ఫ్లాష్ లైట్లు, టార్చ్ లైటు వెలిగించాలని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుకి స్పందిస్తూ దేశ ప్రజలంతా జ్యోతిలు వెలిగించి ఐక్యత చాటారు. అయితే అందరిదీ ఒకదారి తనదో దారి అన్నట్టుగా ప్రవర్తించే ఆర్జీవీ దీపం బదులుగా సిగరెట్ వెలిగించాడు. వర్మ ఇలా చేయడం కొత్తేమి కాదు కాబట్టి ప్రేక్షకులు కూడా పెద్దగా అవాక్కవలేదు. 

అంతేకాదు కరోనా పై ప్రభుత్వ హెచ్చరికలు సిగరెట్ పై ప్రభుత్వ హెచ్చరికలను పాటించకపోవడం కన్నా ప్రమాదకరమని కామెంట్ పెట్టాడు. ఏం చేసినా సరే అందులో తన మార్క్ చూపించే కరోనాపై కూడా అతనా పైత్యం చూపిస్తున్నాడు. రీసెంట్ గా కరోనా పై ఒక సాంగ్ కూడా రాసి పాడిన వర్మ లాక్ డౌన్ టైం లో ఫుల్ టైం పాస్ చేస్తున్నాడు. మొత్తానికి వర్మ వెలిగించిన ఈ సిగరెట్ నిప్పు రకరకాల అర్ధాలు వచ్చేలా చేస్తుంది. 

Related Post

సినిమా స‌మీక్ష