నానినే కాదు ఆమె కూడా విలనే..!

April 04, 2020


img

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో చేస్తున్న సినిమా 'వి'. కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ సినిమాలో నాని విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నానితో పాటుగా సుధీర్ బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. సినిమాలో హీరోయిన్స్ గా నివేదా థామస్, అదితి రావు హైదరి నటిస్తున్నారు.  

అయితే ఈ సినిమాలో నాని మాత్రమే కాదు అదితి రావు కూడా నెగటివ్ రోల్ లో కనిపిస్తుందని తెలుస్తుంది. మణిరత్నం చెలియా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా అదితి రావు హైదరి సమ్మోహనం, అంతరిక్షం సినిమాల్లో నటించింది. నాని విలో సుదీర్ బాబు కు జోడీగా నివేదా థామస్, నానికి జంటగా అదితి రావు హైదరి నటిస్తుంది. మరి విలనిజంలో నానికి తోడుగా అదితి ఎలా అలరిస్తుందో చూడాలి. 

 


Related Post

సినిమా స‌మీక్ష