టిక్ టాక్ లో త్రిష సందడి

April 04, 2020


img

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పుడు తన టాలెంట్ చూపించేందుకు టిక్ టాక్ లోకి వచ్చేసింది. ఎవరైనా.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. చేసే ఈ టిక్ టాక్ వల్ల చాలామంది టాలెంటెడ్ పీపుల్స్ బయటకు వస్తున్నారు. ఇప్పుడు టిక్ టాక్ లోకి త్రిష కూడా ఎంట్రీ ఇచ్చింది. తన తోలి వీడియో ఒక సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ అదరగొట్టింది అమ్మడు. త్రిష క్యూట్ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న త్రిష ఈమధ్య కెరియర్ లో వెనుకపడ్డట్టు అనిపించింది. అయితే తమిళంలో 96 సినిమాతో ఫామ్ లోకి రాగా అక్కడ మంచి అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో చిరు ఆచార్య ఛాన్స్ వచ్చినా సరే ఎందుకో త్రిష ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చింది. తమిళంలో ఇప్పటికి ఛాన్సులు వస్తున్నా తెలుగులో ఆమెకు అవకాశాలు రావట్లేదు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు మరింత దగ్గరగా ఉండేలా త్రిష టిక్ టాక్ లో వీడియోలు పెట్టనుంది. ఇప్పటికే ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో సెలబ్రిటీస్ హవా కొనసాగిస్తుండగా టిక్ టాక్ లో కూడా వారు పాపులర్ అవ్వాలని చూస్తున్నారు. Related Post

సినిమా స‌మీక్ష