సినీ కార్మికుల కోసం నయనతార విరాళాలు..!

April 04, 2020


img

కరోనా వల్ల నిత్యావసరాలు ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు అండగా సినీ సెలబ్రిటీస్ విరాళాలు ప్రకటిస్తున్నారు. తెలుగులో కరీనా క్రైసిస్ చారిటీ పేరుతొ విరాళాలు సేకరిస్తున్నారు. కోలీవుడ్ లో కూడా సెలబ్రిటీస్ తమ వంతు బాధ్యతగా విరాళాలు ఇస్తున్నారు. లేటెస్ట్ గా కరోనా వల్ల పనుల్లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికుల కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార 20 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు ఆమె తన విరాళాలు అందించారు. 

సినీ కార్మికులకు కావాల్సిన నిత్యావసరాలు అందించేలా ఈ విరాళాలు ఉపయోగిస్తారు. ఇదిలాఉంటే తెలుగులో లావణ్య త్రిపాఠి మాత్రమే 1 లక్ష విరాళంగా ప్రకటించారు. ప్రణీత తన సొంత ఫౌండేషన్ ద్వారా ఇబ్బందులు పడుతున్న 50 కుటుంబాలకు 2000 చొప్పున 1 లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. అయితే కోట్లకు కోట్లు తీసుకునే మిగతా హీరోయిన్స్ మాత్రం ఇంకా ఎలాంటి డొనేషన్స్ ప్రకటించలేదు. Related Post

సినిమా స‌మీక్ష