కరోనా కోసం కదిలిన బాలయ్య.. భారీ విరాళం ప్రకటన..!

April 04, 2020


img

కరోనా మహమ్మారి వల్ల ప్రజలు నానా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ వల్ల కష్టాలు పడుతున్న ప్రజల కోసం సినీ తారలు విరాళాలు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా కరోనా వల్ల కష్టాలు పడుతున్న సినీ కార్మికుల కోసం ఛారిటీని స్థాపించారు. ఇప్పటికే సిసిసికి భారీ విరాళాలు వచ్చాయి. అయితే లేట్ గా స్పందించినా లేటెస్ట్ గా తన విరాళాలు ప్రకటించాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. 

కరోనా నివారణ చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు బాలయ్య తన విరాళాలు ప్రకటించారు. ఎపి సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలు, తెలంగాణా రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలు, సిసిసికి  మరో పాతిక లక్షలు విరాళంగా ఇచ్చారు బాలయ్య బాబు. ఇక సీసీసీ కోసం బాలకృష్ణ ఇచ్చిన విరాళం అందుకున్న సందర్భంగా చిరంజీవి బాలయ్యను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి సినీ పరిశ్రమకు మీరు ఎప్పుడు సహకరిస్తారని అన్నారు చిరంజీవి. Related Post

సినిమా స‌మీక్ష