ఆటోజానీ లైన్ లో పెడతాడా..!

April 03, 2020


img

ఎప్పటికైనా చిరుని డైరెక్ట్ చేయాలనే కోరిక ఉందని ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా అంటూ పూరి ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. మెగా హీరోలు పవన్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ లతో సినిమాలు తీసిన పూరి చిరంజీవి కోసం ఆటోజానీ కథ రాసుకున్నాడు. అయితే పూరి చెప్పిన కథ బాగున్నా సెకండ్ హాఫ్ నెరేషన్ నచ్చక అది పక్కన పడేశాడు చిరు. 

అయితే పూరి మాత్రం చిరు సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆటోజానీ కలో చిరు సూచించిన మార్పులు చేశాడాట.. మార్చి రాసిన కథ చిరుకి వినిపించడం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకవేళ ఆ కథ నచ్చకపోతే మరో అదిరిపోయే కథ చిరు కోసం సిద్ధం చేశాడట పూరి. లైన్ మెగాస్టార్ తో చెప్పి ఆయన ఓకే అంటే మాత్రం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తాడని తెలుస్తుంది. 


Related Post

సినిమా స‌మీక్ష