నాని సినిమాకు శాటిలైట్ ప్రాబ్లెమ్స్

April 03, 2020


img

నాచురల్ స్టార్ హీరోగానే కాదు నిర్మాతగా కూడా సక్సెస్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. నిర్మాతగా నాని మొదటి సినిమా అ! సూపర్ ప్రయోగాత్మక సినిమా కాగా సెకండ్ మూవీగా వచ్చిన హిట్ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా సూపర్ అనిపించుకుంది. నాని నిర్మాతగా సినిమా తీస్తే అది కచ్చితంగా డిఫరెంట్ గా ఉంటింది అని మరోసారి ప్రూవ్ అయ్యింది.

అయితే సినిమా హిట్ అయినా నాని హిట్ మూవీ ఇంకా శాటిలైట్ మాత్రం కాలేదట. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన హిట్ శాటిలైట్ రైట్స్ ఎవరు కొనలేదట. రిలీజ్ ముందు ఒకటి రెండు ఆఫర్లు రాగా రిలీజ్ తర్వాత చూద్దామని నాని చెప్పాడట. ఇక రిలీజ్ తర్వాత నాని చెబుతున్న రేటు కి ఎవరు ముందుకు రావట్లేదని తెలుస్తుంది. సినిమాలు ప్రొడ్యూస్ చేయడమే కాదు నాని బిజినెస్ లెక్కల్లో కూడా ముందు జాగ్రత్త ఉండాలని అంటున్నారు.Related Post

సినిమా స‌మీక్ష