8న బన్ని సర్ ప్రైజ్..!

April 03, 2020


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఆర్య, ఆర్య 2 తర్వాత బన్ని సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అందుకే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బన్ని సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా మాస్ లుక్ లో కనిపిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. 

ఇక ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే ఆరోజు బన్ని ఫ్యాన్స్ కు స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. రంగస్థలం తర్వాత సుకుమార్, అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా మరో సంచలనం అవుతుందో లేదో చూడాలి. 


Related Post

సినిమా స‌మీక్ష