'రంగ్ దే' శాటిలైట్ డీల్ క్లోజ్

April 02, 2020


img

నితిన్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగ్ దే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవరాజ్ నాగవంశీ ఈ మూవీ నిర్మిస్తున్నారు. సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఈ సినిమాను కెమెరా మెన్ గా వర్క్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాశాటిలైట్, డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు తేలుతుంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు, డిజిటల్ రైట్స్ ను జి5 కొనేసినట్టు తెలుస్తుంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ రెండు కలిపి 10 కోట్లకు కోట్ చేశారట. 

భీష్మ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన నితిన్ రంగ్ దే సినిమాతో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. తొలిప్రేమతో హిట్ అందుకున్న డైరక్టర్ వెంకీ అట్లూరి సెకండ్ ప్రాజెక్ట్ మిస్టర్ మజ్నుతో ఫెయిల్ అయ్యాడు. అందుకే రంగ్ దే విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు దర్శకుడు వెంకీ. నితిన్, కీర్తి సురేష్ మొదటిసారి జత కడుతున్న ఈ రంగ్ దే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. టీజర్ కూడా రిలీజ్ కాకముందే సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కొన్నారంటే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. Related Post

సినిమా స‌మీక్ష