బాలకృష్ణ సైలెంట్ కు కారణం ఏంటి..!

April 02, 2020


img

కరోనా వల్ల నిరాశ్రయులుగా మారిన సినీ కార్మికుల కోసం.. తమ వంతు బాధ్యతగా సినీ పెద్దలంతా కలిసి సీసీసీ ఛారిటీని ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కలిసి ఈ ఛారిటీని ఏర్పాటు చేశారు. చిరు ఆధ్వర్యంలో జరుగుతున్నా ఈ కార్యక్రమానికి హీరోలంతా తమ వంతుగా డొనేషన్స్ ఏర్పాటుచేస్తున్నారు. అయితే ఈ డొనేషన్స్ విషయంలో నందమూరి నటసింహం బాలకృష్ణ మాత్రం ఎలాంటి డొనేషన్స్ ఇవ్వలేదు.

బాలకృష్ణ సైలెంట్ కు కారణం ఏంటి.. ఎంత డొనేట్ చేద్దామనే ఆలోచనలో లేట్ చేస్తున్నాడా.. మాములుగా ఇలాంటి విషయాల్లో తన వంతు సాయం వెంటనే ప్రకటించే బాలయ్య బాబు ఎందుకు ఈసారి వెనుకపడ్డాడు. ఆయన ఇలా సైలెంట్ గా ఉండటానికి గల కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. యువ హీరోలు సైతం సిసిసికి విరాళాలు ఇస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ప్రభుత్వానికి 75 లక్షలు సిసిసికి మరో పాతిక లక్షలు విరాళాలు ప్రకటించాడు. ఇక బాబాయ్ బలాటలోనే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇప్పటివరకు ఎలాంటి డొనేషన్ ప్రకటించలేదు. అయితే నారా రోహిత్ మాత్రం 30 లక్షలు డొనేట్ చేశాడు. పీఎం కేర్స్ ఫండ్, ఏపీ, తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించాడు రోహిత్. Related Post

సినిమా స‌మీక్ష