10 లక్షల మంది 'ఆహా' అనేశారు.!

April 01, 2020


img

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొత్తగా ఆహా అంటూ ఓటిటి ఫ్లాట్ ఫామ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండతో ఆహా ఓటిటిని ప్రమోట్ చేస్తున్నారు అల్లు అరవింద్. ప్రస్తుతం కరోనా భారీన పడకుండా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ఆహాకు బాగా కలిసి వచ్చింది. థియేటర్లు బంద్ అవడంతో అందరు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద పడ్డారు. మొదలు పెట్టడమే ఆలస్యం ఇప్పటికే ఆహాకి 1 మిలియన్ డౌన్ లోడ్స్ పూర్తి అయ్యాయట. ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు ఆహా నిర్వాహకులు. 

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లకు పోటీగా తెలుగులో ఓటిటి డిజిటల్ స్ట్రీమింగ్ గా వచ్చిన ఆహాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 10 లక్షల డౌన్ లోడ్స్ అయ్యాయి అంటే ఆహా క్లిక్ అయినట్టే లెక్క. అంతేకాదు ఇక మీదట తెలుగు స్టార్ హీరోల సినిమాలు ఆహాలోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అమేజాన్ వల్ల తెలుగు సినిమాలకు నష్టం వస్తుందని భావిస్తున్నారు. అందుకే తెలుగు ఓటిటి కి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చేలా ఉన్నారు. Related Post

సినిమా స‌మీక్ష