డమ్మీ స్టార్ వర్సెస్ రీమేక్ స్టార్.. మహేష్, విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవ..!

April 01, 2020


img

తెలుగు సూపర్ స్టార్ మహేష్.. తమిళ క్రేజీ హీరో విజయ్.. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అసలు కలుసుకున్న దాఖలాలు లేవు. కానీ ఎక్కడ చెందిందో ఏమో కానీ మహేష్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతుంది. ప్రస్తుతం దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా భూతాన్ని సైతం పక్కన పెట్టి ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ట్రోల్స్ ట్విట్టర్ లో వైరల్ గా మారాయి, మహేష్ ను డమ్మీ స్టార్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరి ట్రోల్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇక దానికి ప్రతీకారంగా విజయ్ ను రీమేక్ స్టార్ గా ట్రోల్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్. 

ట్విట్టర్ లో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ట్రోల్స్ బాగా వైరల్ అయ్యాయి. టాప్ ట్రెండింగ్ లో ఉండేలా ఈ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవ ముదిరింది చెప్పొచ్చు. మహేష్ బాబుని అప్పట్లో తమిళ స్టాండింగ్ కమెడియన్ రాతి మొహం అన్నాడు.. అప్పుడే తమిళ హీరోల మీద మహేష్ ఫ్యాన్స్ ఫెయిర్ అయ్యారు. అయితే ఆ వ్యవహారాన్ని కొనసాగిస్తూ విజయ్ ఫ్యాన్స్ మహేష్ ను డమ్మీ స్టార్ గా ట్రోల్ చేస్తున్నారు. అయితే మహేష్ చేసిన ఒక్కడు, పోకిరి సినిమాలు తమిళంలో రీమేక్ చేశాడు కాబట్టి విజయ్ ను రీమేక్ స్టార్ అంటూ మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ కు తోడుగా తమిళంలో అజిత్ ఫ్యాన్స్ విజయ్ ను టార్గెట్ చేస్తున్నారు. మరి ఈ ఫ్యాన్స్ వార్ ఎప్పటికి ముగుస్తుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష