కరోనాపై కీరవాణి సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్..!

April 01, 2020


img

కరోనా వైరస్ మనకు సోకకుండా ఉండాలంటే జస్ట్ ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంటే చాలు.. చేతులు శుభ్రంగా ఉంచుకుంటే చాలు.. కరోనా పై అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీస్ సైతం ఇప్పటికే తమ మెసేజ్ లు అందించారు. లేటెస్ట్ గా మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి తన సూపర్ హిట్ సాంగ్ పేరడీతో కరోనా గురించి అవేర్ నెస్  ఏర్పడేలా చేస్తున్నారు. రాజమౌళి డైరక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ పేరడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కీరవాణి. 

we will stay at home.. we will stay at home.. we stay safe.. అంటూ కీరవాణి స్వరంతో ఈ సాంగ్ వచ్చింది. ఫేక్ వార్తలు నమ్మొద్దంటూ.. మనల్ని కాపాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు ఎవరో కాదు మనలోని దేవుళ్ళు అంటూ కీరవాణి రాసిన లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ డైరక్టర్ కోటి కరోనాని తరిమి కొడదాం అంటూ ఒక సాంగ్ కంపోజ్ చేశాడు. ఇప్పుడు కీరవాణి కూడా తారక్ సాంగ్ పేరడీ చేసి కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
Related Post

సినిమా స‌మీక్ష