హీరోయిన్లకు బాధ్యత లేదా..!

March 31, 2020


img

కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్న సినీ కార్మికుల కోసం అండగా ఉండేందుకు స్టార్స్ ముందుకొచ్చారు. సీసీసీ చారిటీ స్థాపించి పేద సినీ కళాకారులకు నిత్యావసరాలను అందిస్తున్నారు. అయితే ఇప్పటివరకు స్టార్ హీరోలు, నిర్మాణ సంస్థలు, డైరక్టర్స్ ఇలా అందరు తమకు తోచిన విరాళాలు ప్రకటించారు. హీరోయిన్స్ లో కేవలం లావణ్య త్రిపాఠి 1 లక్ష రూపాయలు డొనేట్ చేసింది. ప్రణీత తన చారిటీ ద్వారా లక్ష రూపాయలు సహాయం ప్రకటించింది.

అయితే కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్స్ ఎవరు విరాళాలు ప్రకటించలేదు. కరోనా వ్యాప్తీ చెందకుండా జాగ్రత్తలు చెబుతున్నారే తప్ప డొనేషన్స్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గుతున్నారు. అందుకే కమెడియన్ కమ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ స్టార్ హీరోయిన్స్ మీద ఫైర్ అవుతున్నాడు, తన బాధ్యతగా బ్రహ్మాజీ 75 వేల రూపాయలు, ఆయన తనయుడు సంజయ్ 25 వేల రూపాయలు సీసీసీకి ఇస్తున్నట్టు తెలిపారు. కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం కాదు ఇలాంటి టైం లో ముందుకొచ్చి సహాయం చేయాలని.. ఇచ్చే విరాళాలు వేలల్లోనో, లక్షల్లోనే ఉన్నా పర్వాలేదు.. కానీ కనీసం సామాజిక బాధ్యత వ్యవహరించాల్సిన టైం ఇది అని అన్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష