ఆచార్య ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..!

March 30, 2020


img

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. అయితే టైటిల్ చిరు నోటి నుండే లీక్ అవగా ఆచార్య ఫస్ట్ లుక్ ఏప్రిల్ 2 శ్రీరామనవమికి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. టైటిల్ లోగోతో పాటుగా చిరు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. 

ఈ సినిమాలో చిరు నక్సలైట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఆచార్య ఫస్ట్ లుక్ తో చిరు సర్ ప్రయిజ్ చేయాలని చూస్తున్నాడు. ఖైదీ నంబర్ 150, సైరా సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న చిరు ఆచార్యతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. అనసూయ ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్. 



Related Post

సినిమా స‌మీక్ష