18 పేజెస్ లో నిఖిల్ రోల్ అదేనా..!

March 30, 2020


img

నిఖిల్ హీరోగా సూర్య ప్రతాప్ డైరక్షన్ లో 18 పేజెస్ సినిమా తెరకెక్కుతుంది. కుమారి 21ఎఫ్ తర్వాత సూర్య ప్రతాప్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో నిఖిల్ సరసన ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నిఖిల్ మతిమరుపు పాత్రలో కనిపిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. మారుతి డైరక్షన్ లో నాని హీరోగా వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాలో కూడా ఇలానే హీరో మరిమరుపుగా ఉంటాడు. 

ఆ సినిమాలో నాని కామెడీకి సినిమా సూపర్ హిట్టైంది. నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్ సినిమాలో నిఖిల్ అలాంటి పాత్రలోనే కనిపిస్తాడట. ఇక ఇదే కాకుండా నిఖిల్ కార్తికేయ సీక్వల్ లో కూడా నటిస్తున్నాడు. చందు మొండేటి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సీక్వల్ కూడా చాలా క్రేజీగా ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ అర్జున్ సూరవరంలో పర్వాలేదు అనిపించుకున్న నిఖిల్ రానున్న ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులతో మళ్ళీ సూపర్ హిట్ అందుకునేలా ఉన్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష