కమల్ కు కరోనా పాజిటివ్..?

March 28, 2020


img

కరోనా మహమ్మారి సెలబ్రిటీస్ ను సైతం వదలట్లేదు. బ్రిటన్ ప్రధాని జాన్సన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని లేటెస్ట్ టాక్. ప్రస్తుతం కమల్ వైద్యుల సూచనల ప్రకారం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాడని అంటున్నారు. చెన్నైలో కమల్ నివాసానికి హోమ్ క్వారెంటైన్ స్టిక్కర్ అంటించారు. అయితే కొద్దిసేపటికి దాన్ని మళ్ళీ తొలగించారు. ఆ స్టిక్కర్ అతికించడం చూసిన తమిళ జనాలు కమల్ కు కరోనా వచ్చిందని వార్తలు రాయడం మొదలుపెట్టారు. 

అయితే తనకి కరోనా సోకిందన్న వార్తలు రావడంతో వివరణ ఇచ్చుకున్నారు కమల్ హాసన్. తనకు కరోనా రాలేదని.. ఆ ఇల్లు తన పార్టీ మక్కల్ నీది మయ్యంకి వాడుతున్నామని.. ఆ ఇంట్లో తను ఉండటం లేదని వివరణ ఇచ్చారు కమల్. ఇప్పటికే కమల్ కూతుళ్లు శృతి హాసన్, అక్షరా హాసన్ లతో సహా ఫ్యామిలీ వేరు వేరుగా  సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉంటున్నారని ప్రకటించారు.  



Related Post

సినిమా స‌మీక్ష