అనుష్క ఛాన్స్ సమంత కొట్టేసిందా..!

March 28, 2020


img

టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో సింగీతం శ్రీనివాస్ రావు ఒకరు.టెక్నాలజీ అంతగా లేని టైం లోనే ఆదిర్య 369 సినిమా తీసి సంచలనం సృష్టించారు. సింగీతం దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెలుగులో వచ్చాయి. కొన్నాళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉంటూ వచ్చిన సింగీతం శ్రీనివాస్ రావు మరోసారి మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. ఆదిత్య 369 కు సీక్వల్ గా ఆదిత్య 999 తీయాలని అనుకున్నారు.. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అందుకే ఇప్పుడు బెంగళూరు నాగరత్తమ్మ జీవిత కథను తేరా మీదకు తెస్తున్నారని తెలుస్తుంది. 

గాయనిగా మొదలైన ఆమె ప్రస్తానం చివరి దశలో యోగినిగా మారి శేష జీవితాన్ని ముగించింది. నాగరత్తమ్మ జీవిత కథను తేరా మీదకు తెస్తున్నారు సింగీతం శ్రీనివాస రావు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క నటిస్తుందని అంటున్నారు. కథ విన్న అనుష్క ఇంప్రెస్ అవగా ముందు ఓకే చెప్పిన స్వీటీ ఇప్పుడు ఎందుకో వెనక్కి తగ్గిందట. అయితే అనుష్క ప్లేస్ లో సమంత ఈ సినిమా చేస్తుందని తెలుస్తుంది. పెళ్లి తర్వాత సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్న సామ్ నగరత్తమ్మ పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష