ఆచార్య కోసం అనసూయ చిందులు

March 28, 2020


img

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.  సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రెజీనాను ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. అయితే రెజీనా ప్లేస్ లో అనసూయ ఆ స్పెషల్ సాంగ్ చేస్తుందని అంటున్నారు.  

స్మాల్ స్క్రీన్, సిల్వర్  స్క్రీన్ అనే తేడా లేకుండా అనసూయ ఫుల్ స్వింగ్ లో ఉంది. బుల్లితెర మీద అందాలతో అలరిస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం కొత్తగా ట్రై చేస్తుంది. ఇప్పటికే విన్నర్ లో సాయి తేజ్ సరసన స్పెషల్ సాంగ్ చేసిన అనసూయ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ ఛాన్స్ అందుకుంటుందని తెలుస్తుంది. అదే నిజమైతే అనసూయకు తిరుగు లేదు అన్నట్టే. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా అదరగొట్టిన అనసూయ ఈ స్పెషల్ సాంగ్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష