సర్ కాదు తమ్ముడిని అన్నా.. పవన్ ఫై కేటీఆర్ అభిమానం ఇది..!

March 27, 2020


img

కరోనాపై భరత దేశం యుద్ధం చేస్తుంది.. ఈ యుద్ధం కోసం దేశ ప్రజలందరూ సైనికులుగా మారాలని ప్రధాని పిలుపుకు ఒక్కరోజు మాత్రమే ఇళ్లలో ఉన్నారు. జనతా కర్ఫ్యూ ఒక్కటి మాత్రం బాగా చేసిన ప్రజలు ఆ తర్వాత రోజు నుండి అవసరం ఉన్నా లేకున్నా బయటకు వస్తున్నారు. ఇక దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణా రాష్ట్రలో కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తల గురించి కేటీఆర్ కు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.   


ధన్యవాదాలు కేటిఆర్ సర్.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు చేస్తున్న సేవలకు శుభాకాంక్షలు. కేసీఆర్ నాయకత్వంలో మీరు అద్భుతంగా పనిచేస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ ట్వీట్ కు సమాధానంగా కెటిఆర్ మళ్ళీ ట్వీట్ తో స్పందించారు. థ్యాంక్స్ అన్నా..  మీరు ఎప్పటినుండి నన్ను సర్ అని సంభోదిస్తున్నారు.. నేను ఎప్పటికి మీ బ్రదర్ నే అంటూ ట్వీట్ చేశాడు కె.టి.ఆర్. పవన్ పై కెటిఆర్ చూపించిన అభిమానానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 

 

 



Related Post

సినిమా స‌మీక్ష