రామ్ చరణ్ 70 లక్షల విరాళం..!

March 26, 2020


img

దేశంలోకి ఎంటర్ అయినా కరోనా వైరస్ ను మనం ఇళ్ల దగ్గర ఉండి దాని అంతుచూద్దాం అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వారికి సహాయం అందించేందుకు సినీ తారలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ను పారద్రోలేందుకు సహకారంగా పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ కు పవన్ కళ్యాణ్ రెండు కోట్లు విరాళం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ స్పూర్తితో రామ్ చరణ్ కూడా తన వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు 70 లక్షల విరాళం ప్రకటించారు. కరోనాపై అందరం కలిసికట్టుగా పోరాడదాం అని.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరోనా వైరస్ ప్రబలకుండా మనం జాగ్రత్తలు పాటించాలని అన్నారు రామ్ చరణ్.  


హీరో నితిన్ ఇప్పటికే ఏపి, తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో పది లక్షలు విరాళం అందించారు. ప్రస్తుతం తెలుగు స్టార్స్ లో నితిన్, పవన్, రామ్ చరణ్ మాత్రమే విరాళాలు ప్రకటించారు. కోలీవుడ్ లో రజినీకాంత్ 50 లక్షలు, విజయ్ సేతుపతి 10 లక్షలు విరాళాలు ప్రకటించారు. అంతకుముందే సూర్య, కార్తీలు కూడా 20 లక్షల విరాళాలు ప్రకటించారు. అయితే తమిళ హీరోలు కరోనా వల్ల పేద కళాకారులకు అండగా ఉండేందుకు వారి విరాళాలు ప్రకటించారు. Related Post

సినిమా స‌మీక్ష