కరోనాపై పాట.. సోషల్ మీడియాలో వైరల్..!

March 26, 2020


img

 ప్రస్తుతం దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రతరం కాకుండా పీఎం మోడీ 21 రోజులు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లాక్ డౌన్ విధానం కొనసాగుతుంది. ఇంట్లోనే ఉంటూ ఏదైనా అవసరం ఉంటేనే అది నిత్యావసరాల కోసమే బయటకు రండని ప్రభుత్వాలు,  పోలీసులు చెబుతున్నారు. అయినా సరే వైరస్ తీవ్రతని అంచనా వేయలేని ప్రజలు గుంపులు గుంపులుగా బయట తిరుగుతున్నారు. 

అయితే ప్రస్తుతం ఈ కరోనా వైరస్.. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలపకురా.. కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా అంటూ ఒక సాంగ్ వచ్చింది. నీ ప్రాణాలు కాపాడుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉందని చెబుతున్న ఈ సాంగ్ ఇప్పుడు అందరు వింటున్నారు. వైరస్ బారిన పడకుండా ఇంటి దగ్గరే ఉండి నిన్ను నీ కుటుంబాన్ని ఈ దేశాన్ని కాపాడుకో అంటూ వచ్చిన ఈ సాంగ్ మీరు కూడా ఒకసారి వినండి. 

Related Post

సినిమా స‌మీక్ష