ఆచార్యలో చరణ్ పాత్ర అదేనా..!

March 25, 2020


img

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆచార్య టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో చరణ్ నటిస్తాడని అంటున్నారు. ముందు ఆ పాత్రకు మహేష్ ను అనుకోగా బడ్జెట్ ఎక్కువవుతుంది భావించి వెనక్కి తగ్గారు. ఆచార్యలో చరణ్ కన్ఫర్మ్ కాగా తన పాత్ర ఇదే అంటూ ఒక న్యూస్ బయటకు వచ్చింది. 

చరణ్ ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపిస్తాడట. అంతేకాదు చరణ్ పాత్ర సినిమాలో మరణిస్తుందట. అతను చేయాలనుకున్న ఆశయాన్ని చిరు పూర్తి చేస్తాడట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. ఈమధ్య చిరు కూడా నక్సలైట్ కాస్ట్యూమ్ లో ఉన్న పిక్స్ షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయ్యాయి. సో చరణ్ గురించి వస్తున్నా వార్తలు కూడా నమ్మేలా ఉన్నాయి. 2021 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు,Related Post

సినిమా స‌మీక్ష