రష్మికకు నో ఛాన్స్..!

March 25, 2020


img

కన్నడలో సూపర్ హిట్ అయినా కిరాక్ పార్టీ సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నాడు డైరక్టర్ కమ్ హీరో రక్షిత్ శెట్టి. ఆ సినిమాతోనే రష్మిక మందన్న హీరోయిన్ గా పరిచయమవడమే కాకుండా ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఇక అక్కడ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇక్కడ వరుస స్టార్ ఛాన్సులు రావడం అంతా తెలిసిందే. కిరాక్ పార్టీ తర్వాత రక్షిత్ శెట్టి, రష్మికల మధ్య ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన వీరి రిలేషన్ మధ్యలో బ్రేకప్ అయ్యింది. అయితే అందుకు కారణాలు మాత్రం బయటకు రాలేదు. 

రష్మిక తెలుగులో బిజీ అవడం కన్నడ సినిమాలు తగ్గించడం కన్నడ రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది. ఈమధ్యనే శ్రీమన్నారాయణ అంటూ తెలుగులో లక్ టెస్ట్ చేసుకున్న రక్షిత్ శెట్టి ఆ సినిమాతో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ఇక రష్మిక మాత్రం ఇవేమి పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ వెళ్తుంది. ఇక రక్షిత్ శెట్టి కిరాక్ పార్టీ సీక్వల్ ప్లానింగ్ చేస్తున్నాడు. ఈ సీక్వల్ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు కానీ కొత్త హీరోయిన్ ను దించి రష్మికకు షాక్ ఇస్తున్నాడట రక్షిత్ శెట్టి. Related Post

సినిమా స‌మీక్ష