బాలకృష్ణ, మోక్షజ్ఞలతో సినిమా చేస్తాడట..!

March 25, 2020


img

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ లిస్ట్ లో స్థానం సంపాదించున్నాడు అనీల్ రావిపూడి. పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు వరుస ఇట్లు కొట్టిన అనీల్ రావిపూడి ఆగష్టు నుండి ఎఫ్-3 సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళబోతున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ మళ్ళీ ఇద్దరు ఈ సీక్వల్ లో నటిస్తారని తెలుస్తుంది. ఈ మూవీలో రవితేజ, మహేష్ ఇద్దరిలో ఒకరు నటిస్తారని అన్నారు కాని వాళ్లిద్దరూ ఎవరు ఈ సినిమాలో లేరని తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ 100వ సినిమా కోసం అనీల్ రావిపూడి రామారావు అంటూ ఒక కథ చెప్పాడు. అయితే ఎందుకో ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అవలేదు.  

అయితే ఎప్పటికైనా బాలయ్యతో సినిమా చేస్తా అంటున్న అనీల్ రావిపూడి కేవలం బాలకృష్ణతో పాత్రమే కాదు అందులో మోక్షజ్ఞ కూడా ఉండేలా స్క్రిప్ట్ రాసుకుంటాడట. బాలకృష్ణ, మోక్షజ్ఞ ఇద్దరితో మల్టీస్టారర్ సినిమా చేస్తా అంటున్నాడు అనీల్. ఎఫ్-3 కూడా హిట్ అయితే బాలయ్య పిలిచి మరి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మహేష్ తో హిట్టు కొట్టి స్టార్ డైరక్టర్ లిస్ట్ లో చేరిన అనీల్ రావిపూడి కెరియర్ పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉన్నాడు. Related Post

సినిమా స‌మీక్ష